News November 5, 2025

రామన్నపేట: కుటుంబానికి కష్టం.. ఊరంతా కదిలింది

image

సిరిపురం వాసి శ్రీనివాస్ ఇటీవలే అకస్మాత్తుగా మరణించాడు. ‘చేయిచేయి కలుపుదాం శ్రీనివాస్ కుటుంబానికి భరోసానిద్దాం’ అని గ్రామస్థులు ముందుకొచ్చి రూ.94,317 ఆయన కుటుంబానికి అందజేశారు. భార్య, పిల్లలకు ధైర్యం చెప్పారు. అండగా నిలిచిన వారికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీనర్సు, రమేష్, శ్రీనివాస్, చక్రపాణి, శేఖర్, భద్రాచలం, కనకరత్నం, వెంకటయ్య, రాజు, యాదగిరి, రామకృష్ణ, యాదగిరి, శివ కుమార్ ఉన్నారు.

Similar News

News November 5, 2025

పశువులకు రేబీస్ వ్యాధి ఎలా వస్తుంది?

image

పశువుల్లో ఈ వ్యాధి ‘రేబీస్’ వైరస్‌వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకిన కుక్కలు, పిల్లులు, నక్కలు.. పశువులు, గొర్రెలు, మేకలను కరిచినప్పుడు రేబీస్ సోకుతుంది. అలాగే రేబీస్ సోకిన జంతువుల లాలాజలం, కంటి స్రావాలు.. పాడి పశువుల శరీరంపై ఉన్న గాయాలపై పడినప్పుడు కూడా రేబీస్ వస్తుంది. ఈ వ్యాధి బారినపడిన పశువుల పాలను సరిగా మరిగించకుండా తాగినా, మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వ్యాధి మనుషులకూ సోకే అవకాశం ఉంది.

News November 5, 2025

కపిలతీర్థ ముక్కోటి అంటే తెలుసా.?

image

కార్తీక మాసం పౌర్ణమి రోజున కపిలతీర్థంలో అన్నాభిషేక వార్షిక సేవను నిర్వహిస్తారు. దీనినే కపిలతీర్థ ముక్కోటి అని అంటారు. ఆ రోజున మధ్యాహ్న సమయంలో మహాలింగానికి ఏకాంతంగా అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు.

News November 5, 2025

HYD-VJA ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

image

హైదరాబాద్-విజయవాడ మీదుగా వెళ్లే NH-65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డులో 40-269KM మధ్య 229KM వరకు నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లకు పెంచనుంది. ఇందుకోసం భూసేకరణ చేయడానికి AP, TGల్లో అధికారులను నియమించింది. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిధిలోని 34 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఈ విస్తరణకు రూ.10వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.