News April 7, 2025

రామప్పలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల ప్రపంచ ప్రసిద్ధి చెంది యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఈనెల 14న మిస్ వరల్డ్ టీం సందర్శించనున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట రాష్ట్ర పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. మిస్ వరల్డ్ టీం ఆలయంతో పాటు, రామప్ప సరస్సు, కాటేజీలను సందర్శించనుంది.

Similar News

News April 9, 2025

ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

News April 9, 2025

మహిళలకు కర్ణాటక మంత్రి క్షమాపణలు

image

బెంగళూరులో ఇద్దరు మహిళల పట్ల ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ‘నగరాల్లో మహిళలపై లైంగిక దాడులు సాధారణమే’ అన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది వాటిని వక్రీకరించారు. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన మహిళలు నన్ను క్షమించండి. స్త్రీల రక్షణకే నేనెప్పుడూ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తాను’ అని వివరణ ఇచ్చారు.

News April 9, 2025

నిర్మల్: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

error: Content is protected !!