News February 24, 2026

రామప్ప టెంపుల్ WONDERFUL: ఫ్రాన్స్ దేశస్థులు

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలోగల కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని ఫ్రాన్స్ దేశస్థులు అన్నారు. మంగళవారం ఆలయంలో రామలింగేశ్వర స్వామికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉమాశంకర్, హరీశ్ శర్మ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ గైడ్ తాడే బోయిన వెంకటేశ్ ద్వారా ఆలయ చరిత్ర, శిల్ప సంపద గురించి తెలుసుకున్నారు. వారివెంట టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, అరుణ్ కుమార్, భద్రు ఉన్నారు.

Similar News

News February 28, 2026

CBI క్లీన్ చిట్.. మరి ED కేసు?

image

లిక్కర్ పాలసీకి సంబంధించి CBI కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్ వచ్చినప్పటికీ.. ED దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసు మాత్రం అలాగే ఉంది. తమ దర్యాప్తు కొనసాగుతుందని, వ్యక్తుల వాంగ్మూలాలు, పక్కా ఆధారాలతోనే కేసు నమోదు చేశామని ED వర్గాలు చెబుతున్నాయి. CBI FIR ఆధారంగానే ఈ కేసు మొదలైనప్పటికీ తమ దర్యాప్తు స్వతంత్రంగా సాగుతుందని అంటున్నాయి. హైకోర్టులోనూ CBI కేసు వీగిపోతే ED కేసు స్థితి ఏంటో చూడాలి.

News February 28, 2026

నల్గొండ: మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు నేడే లాస్ట్ డేట్

image

రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో మొత్తం సీట్లు, 7-10వ తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. విద్యార్థులు https://tgms.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్ కావున ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాలోని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కోరారు.

News February 28, 2026

వైభవంగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి భూదేవి, శ్రీదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు పరకాల MLA ప్రకాశ్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని, కళ్యాణాన్ని వీక్షించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.