News February 24, 2025
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రుద్రేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్న శివుడి ఆశీస్సులు భక్తులు పొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
Similar News
News February 24, 2025
MLC ఎన్నికలు.. ఇవాళ సీఎం రేవంత్ ప్రచారం

TG: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న CM రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. NZB, ADB, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో INC తరఫున నరేందర్ బరిలో ఉన్నారు. దీంతో ఆయన తరఫున రేవంత్ ఉదయం 11.30 గంటలకు HYD నుంచి NZB చేరుకొని ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మ. 2 గంటలకు మంచిర్యాలలో, సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థిస్తారు.
News February 24, 2025
నరసరావుపేట: మద్యం షాపులు, బార్లు మూసివేత

పల్నాడు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 3 రోజుల పాటు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి మణికంఠ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సమయాల్లో గందరగోళ పరిస్థితులు రాకుండా ఉండేందుకు తాత్కాలికంగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 24, 2025
రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

TG: లైఫ్ సైన్సెస్‌లోని పరిశోధనలు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే 22వ బయో ఏషియా సదస్సు రేపు, ఎల్లుండి HYDలోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని CM రేవంత్ ప్రారంభిస్తారు. దీనికి 50 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. కేంద్రమంత్రి పీయూశ్ గోయల్, నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్, ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్ సహా పలు ఫార్మా కంపెనీల ఛైర్మన్లు ప్రసంగిస్తారు.