News April 3, 2025
రామయ్య భక్తుల కోసం ‘క్యూఆర్ కోడ్’

భద్రాచలంలో శ్రీరామనవమి, శ్రీరామ మహాపట్టాభిషేకాలను పురస్కరించుకొని భక్తుల కోసం క్యూఆర్ కోడ్‌ను భద్రాద్రి జిల్లా పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ల వద్దకు భక్తులు సులభంగా కనుగొని అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో QR కోడ్ రూపొందించారు. సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడనుంది.
Similar News
News September 17, 2025
రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్‌లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.
News September 17, 2025
నంద్యాల: వేధింపులతో భార్య మృతి.. భర్తకు 7ఏళ్ల జైలు శిక్ష

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ, ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన భర్త కనకం కృష్ణయ్యకు నంద్యాల కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లికి చెందిన రాజేశ్వరిని భర్త కనకం కృష్ణయ్య అదనపు కట్నం కోసం వేధించారు. మనస్తాపానికి గురైన ఆమె 2022లో విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.
News September 17, 2025
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సంచిలో మహిళ డెడ్‌బాడీ

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.