News November 24, 2025

రామసముద్రం యువతి బెంగళూరులో దారుణ హత్య

image

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన విద్యార్థిని బెంగళూరులో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. రామసముద్రం (M) బిక్కంగారిపల్లికి చెందిన దేవిశ్రీ (21) బెంగళూరులో BBA చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థితో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రికి చెందిన ప్రేమ్ వర్ధన్ పరిచయం పెంచుకున్నాడు. వారి మధ్య ఏం జరిగిందో తెలిదు.. నిన్న రాత్రి హత్య చేసి పరారయ్యాడు.

Similar News

News November 24, 2025

జగిత్యాల: కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్: సంజయ్

image

కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వారు దోచుకుంటే.. తర్వాత కాంగ్రెస్ దోచుకుంటుందని పేర్కొన్నారు. రెండేళ్లు పాలనలో ఉండి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి కల్పించకుండా మోసగిస్తుందని అన్నారు.

News November 24, 2025

సిరిసిల్ల: కార్మికులకు అవగాహన సదస్సు

image

ఈనెల 24 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు సిరిసిల్లలో భవన, ఇతర రంగాల నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు సిరిసిల్ల కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పెద్ద ఎత్తున ఈ సదస్సుకు కార్మికులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 24, 2025

సిరిసిల్ల: కార్మికుల భీమ పెంపు పోస్టర్ ఆవిష్కరణ

image

సిరిసిల్లలోని కలెక్టరేట్లో సిరిసిల్ల ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల భీమా పెంపు పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కార్మిక శాఖ అధికారి నజీర్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాదాబాయి, డిఆర్డిఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.