News February 2, 2025
రామసముద్రం: సీఐ, ఎస్ఐలకు 14 రోజుల రిమాండ్

రామసముద్రం ఎస్ఐ వెంకటసుబ్బయ్య రూ.70 వేలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి తిరుపతి ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారుల విచారణలో ఎస్ఐ వెంకట సుబ్బయ్య,రూరల్ సీఐ రమేశ్ ఇరువురు కుమ్మక్కై లంచం తీసుకున్నట్లు ఆధారాలు ఉండటంతో వారిని విచారించి అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇవాళ హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎస్సై, సీఐలకు 14 రోజులు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.
Similar News
News September 15, 2025
అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి టీకాలు : డీడీ

జిల్లాలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ డీడీ సోమయ్య తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పశు వ్యాధి నియంత్రణలో భాగంగా పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమాన్ని ఏడీలు రామచంద్రరావు, చైతన్య కిషోర్‌లతో కలిసి ప్రారంభించారు. నాలుగు మాసాలు నిండిన పశువులకు ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
News September 15, 2025
సీఎం సదస్సులో నంద్యాల కలెక్టర్

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లతో సదస్సు సోమవారం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ రాజకుమారి గణియా సూచనలు చేశారు. అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు.
News September 15, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 81 అర్జీలు స్వీకరించామన్నారు. ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.