News April 19, 2025

రామాపురం: మృతుడు TDP నాయకుడిగా గుర్తింపు

image

అన్నమయ్య జిల్లా రామాపురంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హసనాపురం పంచాయతీ గొల్లపల్లికి చెందిన TDP నాయకుడు ఇరగంరెడ్డి(50) కడపలో బంధువుల పెళ్లికి బైకుపై బయల్దేరారు. రామాపురం పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వెళ్తున్న కారు ఢీకొట్టడంతో చనిపోయారు. ఆయన మృతికి మంత్రి మండిపల్లి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మృతి TDPకి తీరని లోటని పేర్కొన్నారు.

Similar News

News April 19, 2025

MBNR: కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ సమావేశం

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ నందు కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం వద్దని, ప్రతి కేసు విచారణలో చార్జ్‌షీట్లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. కోర్టు అధికారులు విధులలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 19, 2025

సమిష్టి కృషితో విజయం సాధించాం: గంటా

image

కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరి సమిష్టి కృషితోనే విజయం సాధించామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీపై పూర్తి వ్యతిరేకతతోనే కూటమిలో ఆ పార్టీ కార్పొరేటర్లు చేరారని అన్నారు. జీవీఎంసీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జీవీఎంసీలో అభివృద్ధి కుంటిపడిందన్నారు. 

News April 19, 2025

అలంపూర్ ఆలయ అభివృద్ధికి హై లెవెల్ కమిటీ పరిశీలన

image

అలంపూర్ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం హై లెవెల్ కమిటీ చేపడుతున్న పలు అభివృద్ధి పనులలో భాగంగా శనివారం ఆలయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సభ్యులైన దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం, సభ్యులు & దేవాదాయ శాఖ ధార్మిక అడ్వైజర్ గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, శృంగేరి పీఠాధిపతుల వారి శిష్య బృందం ఆలయాన్ని సందర్శించింది. అనంతరం అభివృద్ధి గురించి చర్చించారు.

error: Content is protected !!