News February 22, 2025
రామాయంపేటలో చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్‌లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.
Similar News
News September 13, 2025
మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.
News September 13, 2025
రాష్ట్ర కళా ఉత్సవ్‌కు మెదక్ జిల్లా విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయిలో జరిగే కళా ఉత్సవ్-2025 పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డీఈఓ రాధా కిషన్ తెలిపారు. వ్యక్తిగత విభాగంలో ఎస్. కౌడిపల్లి, బాలాజీ, శ్రీహర్షిని, ఆర్తిచంద్ర, సాత్విక్ ఎంపిక కాగా, బృందంలో స్పందన, మహేష్, కావేరి, సుర్తిత్రిక, పవన్ ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. వీరిని డీఈఓ , పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
News September 12, 2025
పెద్ద శంకరంపేట : మనస్థాపంతో బావిలో దూకి యువకుడి మృతి

పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.