News April 16, 2025
రామాయంపేటలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(82) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News April 19, 2025
ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ శుక్రవారం సూచించారు. ఈ మేరకు నిజాంపేట మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్ వెంకటాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు సమర్థవంతంగా వేగవంతంగా జరపాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.
News April 19, 2025
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి భూ భారతి: కలెక్టర్

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం భూ భారతిని అమలు చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. భూ భారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూ భారతి చట్టం -2025పై అవగాహన కార్యక్రమంలో హాజరయ్యారు. అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ మల్లయ్య, కాగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషా రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
News April 18, 2025
న్యాయవాదుల అభిమానం మరువలేనిది: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం మరువలేనిదని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మి శారద అన్నారు. సూర్యాపేటకు బదిలీ అయిన సందర్భంగా మెదక్ కోర్టులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. ఇక్కడ సేవలందించడం గొప్పవరం అన్నారు. ప్రతి న్యాయవాది పేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు. మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం వెలకట్టలేనిదని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.