News October 7, 2025
రామాయణం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథం: ఎస్పీ

మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథంగా ఉందని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, కర్తవ్యం వంటి మార్గాలు నేటి యువతకు ఆచరణీయమని, వాటిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఎస్పీ సూచించారు.
Similar News
News October 8, 2025
నేటి ముఖ్యాంశాలు

* సమర్థుడికే టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు: CBN
* బీసీ రిజర్వేషన్లపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ
* గ్రూప్-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ
* కల్తీ మద్యం వెనుక ఉన్నదంతా బాబు అండ్ గ్యాంగే: జగన్
* జగన్ రోడ్ షోకు అనుమతి నిరాకరణ
* పొన్నం, అడ్లూరి వివాదం.. మాట్లాడి పరిష్కరిస్తానన్న TPCC చీఫ్
News October 8, 2025
రేపే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

TGలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠకు రేపు తెర పడనుంది. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. పిటిషనర్ వాదనను సమర్థిస్తూ న్యాయస్థానం తీర్పిస్తే రిజర్వేషన్ల అమలు నిలిచిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే పార్టీ తరఫున ఈ హామీని నెరవేరుస్తూ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.
News October 8, 2025
మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

AP: సినీ నటుడు మోహన్‌బాబుకు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది.