News January 11, 2026

రామారెడ్డి: ఎమ్మెల్యే బ్యాటింగ్.. ఎంపీడీవో బౌలింగ్

image

రామారెడ్డి మండల కేంద్రంలో యువజన నాయకులు నిర్వహిస్తున్న రామారెడ్డి ప్రీమియర్ లీగ్-2026 క్రికెట్ టోర్నమెంట్ శనివారం జరిగింది. మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు జడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన పోటీల్లో పాల్గొని బ్యాటింగ్ చేశారు. నాగిరెడ్డిపేట్ ఎంపీడీవో కురుమ ప్రవీణ్ బౌలింగ్ వేశారు. యువకులతో కలిసి క్రికెట్ ఆడినందుకు ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News January 30, 2026

మన్యంకొండ: సూర్యప్రభ వాహనంపై లక్ష్మీ వేంకటేశ్వరుడు!

image

మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘశుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ స్వామివారిని మెట్ల మార్గం గుండా వైభవంగా ఊరేగించారు. ఈ వేడుకను వీక్షించేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

News January 30, 2026

మహిళల పట్ల శక్తి టీం రక్షణ కవచం: SP

image

అన్నమయ్య జిల్లాలో మహిళల భద్రత, చిన్నారుల రక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘శక్తి’ బృందాలు, స్థానిక పోలీసులు భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో వేగంగా విస్తరిస్తున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సామాజిక రుగ్మతలపై ప్రజలను చైతన్య పరిచారు.

News January 30, 2026

మేడారం జాతరలో చేతివాటం..!

image

తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరి పనుల్లో వారుంటే సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శించారు. మేడారం జాతర తొలిరోజే 40 తులాల బంగారం చోరీ జరగగా, జాతర మొత్తం కలిపి 150 తులాల బంగారం చోరికి గురయ్యింది. చోరీలకు పాల్పడిన ముగ్గురు మహిళా దొంగలతో పాటు ఆరుగురు ఒరిస్సా గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.