News December 12, 2025

రామారెడ్డి: కాలభైరవ స్వామి ఆలయం దర్శించుకున్న మంత్రి

image

కామారెడ్డి జిల్లా రామారెడ్డి-ఇస్సన్నపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయంలో బహుళ అష్టమి సందర్భంగా శుక్రవారం ఉదయం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు హోమం, అభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి శేష వస్త్రం, చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Similar News

News December 14, 2025

చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

image

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్‌ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

News December 14, 2025

పాలమూరు: మెస్సీ మీద ఉన్న ప్రేమ BCలపై లేదు: మాజీ మంత్రి

image

రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీపై ఉన్నంత ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నా, రేవంత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. నల్గొండ జిల్లాలో బీసీ వ్యక్తికి జరిగిన అవమానంపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

News December 14, 2025

కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

image

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.