News January 23, 2025
రామారెడ్డి: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు KMR జిల్లా అదనపు SP చైతన్య రెడ్డి బుధవారం తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారంలో పొక్కిలి రవి(41) ఈ నెల 19న హత్యకు గురయ్యాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామారెడ్డి SI నరేష్ ఐదుగురిని అరెస్టు చేసి విచారించగా.. చేసిన నేరాన్ని వారు అంగీకరించారన్నారు. వారి నుంచి రూ.15 వేలు, 5 ఫోన్లు, 2 బైక్‌లు, సుత్తె, కర్ర, గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News January 8, 2026
రివర్స్ కండీషనింగ్ గురించి తెలుసా?

సాధారణంగా తలస్నానం చేశాక కండీషనర్ రాస్తారు. కానీ షాంపూకి ముందుగా కండీషనర్‌ని ఉపయోగించే ప్రక్రియను రివర్స్ కండీషనింగ్ అంటారు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ టెక్నిక్ స్కాల్ప్ క్లీనింగ్‌లో ఉపయోగపడుతుంది. జుట్టును హెల్తీగా, హైడ్రేటెడ్‌గా చేస్తుంది. అలాగే కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం సల్ఫేట్‌లు, పారాబెన్, సిలికాన్ లేని మాయిశ్చరైజింగ్ కండీషనర్‌ను ఎంచుకోవాలి.
News January 8, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

EdCIL APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+రూ.4వేలు అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <
News January 8, 2026
వరంగల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనుమానమే?

వరంగల్ కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తయ్యింది. రెండు అంతస్తుల్లో 4 బ్లాక్‌ల వారీగా నిర్మాణాన్ని గౌరి శంకర్ ఇన్ ఫ్రా కంపెనీ రూ.61 కోట్లతో పూర్తి చేసింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేశారు. రూ.87 లక్షల వ్యయంతో కలెక్టర్ నివాసం, అడిషనల్ కలెక్టర్, డీఆర్వో, 8 జిల్లా స్థాయి అధికారుల నివాస క్వార్టర్లు నిర్మించారు. ఈ నెల 19న సీఎం రేవంత్ జిల్లాకు వస్తున్నా ప్రారంభోత్సవం డౌటేగానే ఉన్నట్టు తెలుస్తోంది.


