News February 21, 2025
రామారెడ్డి: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రామారెడ్డి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నరేశ్ వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన గుజ్జుల నవీన్ అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికకు మొబైల్‌పై ఉన్న ఇష్టాన్ని అవకాశంగా చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News July 5, 2025
గిల్ మరో సెంచరీ

ENGతో రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అదరగొడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్సులో భారీ డబుల్ సెంచరీ చేసిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్సులో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 129 బంతుల్లో 100* రన్స్ చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 303/4గా ఉంది. 483 పరుగుల ఆధిక్యంలో ఉంది.
News July 5, 2025
KMR: SC, STల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: బక్కి వెంకటయ్య

గ్రామాల్లో (సివిల్ రైట్స్ డే) కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించి, ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీల భూమి, అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు.
News July 5, 2025
అన్నమయ్య: అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి (M) రాయవరం గ్రామంలో కావలిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ఆండీ గోవిందన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శనివారం రాయచోటి రూరల్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మీడియా ఎదుట నిందితుడుని అదనపు ఎస్పీ వెంకటాద్రి తీసుకొచ్చారు. అతని నుంచి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.