News October 7, 2025

రామ్మూర్తినాయుడుకు సీఎం నివాళులు

image

నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా నివాళులర్పించారు. ప్రథమ వర్ధంతికి సంబంధించిన క్రతువులో పాల్గొన్నారు. అనంతరం నారా రామ్మూర్తి నాయుడు స్మృతి వనం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News October 7, 2025

రేపు పెదఅమిరం రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడినుంచి పెదఅమిరం చేరుకుని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

News October 7, 2025

ఆదిలాబాద్: ఈ నెల 25లోపు KYC చేసుకోవాలి

image

ప్రస్తుతం పోస్టు శాఖా ద్వారా పింఛను పొందుతున్న చేయూత పింఛనుదారులు అందరూ బ్యాంక్‌లో నగదు జమ కావాలంటే బ్యాంకు ఖాతా యాక్టివేషన్ కోసం కేవైసీ చేయించుకొవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆధార్ కార్డు వివరాలు మున్సిపాలిటీలో ఈ నెల 25లోపు సమర్పించాలన్నారు. లేనిపక్షంలో తర్వాత పింఛను తీసుకోవడానికి గురయ్యే ఇబ్బందులకు తమరే భాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.

News October 7, 2025

పుతిన్‌కు మోదీ బర్త్‌డే విషెస్

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ బర్త్‌డే సందర్భంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి విషెస్ తెలియజేశారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇరువురు నేతలూ ఆకాంక్షించారు. పుతిన్ భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించనున్నారు.