News February 5, 2025
రాయగడ డివిజన్ పరిధిలోని రైల్వే లైన్లు ఇవే

రాయగడ<<15366937>> డివిజన్<<>> పరిధిలోని రైల్వే లైన్ల వివరాలను రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్➤ కూనేరు-తెరువలి జంక్షన్➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్➤ పర్లాకిముండి-గుణపూర్ రైల్వేస్టేషన్‌ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.
Similar News
News November 11, 2025
లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దు: కలెక్టర్

లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడమే కాకుండా కచ్చితంగా పాటించాలని సూచించారు. 18 ఏళ్ల నిండకుండా లైసెన్స్ పొందకుండానే వాహనాలు నడపొద్దని, సరైన శిక్షణ పొందకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. యువత రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు.
News November 11, 2025
మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.
News November 11, 2025
కల్తీ నెయ్యి కేసులో విచారణకు ధర్మారెడ్డి

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మాజీ టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. అలిపిరి సమీపంలోని సీబీఐ సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన భద్రతా వలయంలో లోపలికి చేరుకున్నారు. సిట్ డీఐజీ మురళీ రాంభా ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. రెండు రోజులు పాటు విచారణ జరగనుంది.


