News March 30, 2025
రాయచోటిలో కానిస్టేబుల్ సస్పెండ్

రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రామాంజులును ఎస్పీ విద్యాసాగర్ సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాడ శిబిరాల నిర్వహణకు సహకరించి, డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపించాయి. దాంతో పాటు ఓ సారి స్పెషల్ పోలీసులు శిబిరాలపై దాడి చేయగా.. వారిలో రామాంజులు కూడా ఉండడంతో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అందినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు.
Similar News
News November 5, 2025
రామగుండం: ముడి సరుకుల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

రామగుండం ఐటీఐలో వివిధ ట్రేడ్స్‌లో అవసరమైన ముడి సరుకుల కొనుగోలుకు రూ.6.48 లక్షల వ్యయంతో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఈ.సురేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 196 రకాల ముడి సరుకులు ఒకే ప్యాకేజీగా సరఫరా చేయడానికి ఆసక్తిగల సంస్థలు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు రామగుండం ఐటీఐ ప్రిన్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
News November 5, 2025
వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.
News November 5, 2025
కొత్తగూడెం: సింగరేణిలో పలువురు అధికారుల బదిలీ

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైపూర్‌లోని ఎస్టీపీపీ డీజీఎం ఉమాకాంత్ కార్పొరేట్‌కు, ఈఈ స్వీకర్ శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈఈ రాకేష్ ఎస్టీపీపీకి, ఆర్కే ఓసీ ఈఈ అనుదీప్ కేకే ఓసీకి, జేఈ శ్రీనివాసరావును కొత్తగూడెంకు, మందమర్రి డీవైపీఎం ఆసిఫ్‌ను ఆర్జీ 3కి, శ్రీరాంపూర్ సీనియర్ పీఓ కాంతారావును కార్పోరేట్‌కు బదిలీ చేశారు.


