News April 10, 2025
రాయచోటిలో గ్యాంగ్ వార్.. 9 మంది అరెస్ట్

రాయచోటిలో జరిగిన గ్యాంగ్ వార్ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పరారీలో వున్న మరో 15 మంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల నుంచి 5 కట్టెలు, 3ఇనుప రాడ్లు, ఒక చైను, 9 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో10రోజుల క్రితం శివాలయం వద్ద ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడిన సంగతి తెలిసిందే.
Similar News
News September 14, 2025
KMM: డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సోమ, మంగళవారాల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు రావాలని సూచించారు. అడ్మిషన్ల వివరాలను ఈనెల 17న ‘దోస్త్’ పోర్టల్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ చివరి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 14, 2025
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

గుంటూరు శ్రీరామ్ నగర్‌లో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 220, స్కిన్ కేజీ రూ.200గా అమ్ముతున్నారు. కొరమేను చేపలు కేజీ రూ.450, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 220, మటన్ రూ.950గా విక్రయిస్తున్నారు. నగరంలోని చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో రూ. 20 నుంచి రూ. 50ల వరకు ధరల్లో వ్యత్యాసం ఉంది.
News September 14, 2025
ఏలూరు: వర్జీనియా పొగాకుకు రికార్డు ధర

వర్జీనియా పొగాకు ధరలు జోరందుకున్నాయి. గతంలో చూడని విధంగా కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రంలో కిలో రూ. 430 పలికి చరిత్ర సృష్టించింది. పోయిన సంవత్సరం రూ.411 పలికింది. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం రూ. 418 కి అమ్ముడుపోయింది. ఇదే రేట్లు కొనసాగితే లాభదాయకంగా ఉంటుందని రైతులు అంటున్నారు.