News September 20, 2025

రాయచోటిలో నలుగురి మృతి.. జగన్ దిగ్భ్రాంతి

image

రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి<<17770012>> నలుగురు మృత్యువాత పడడంపై<<>> మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Similar News

News September 20, 2025

ఒట్టిగెడ్డలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

వీరఘట్టంలోని వట్టిగెడ్డలో గుర్తుతెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. బ్రిడ్జికి సమీపంలో ఈ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ జి.కళాధర్ తమ సిబ్బందితో వచ్చి వట్టిగెడ్డలో మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. ఎవరైనా చంపేసి పడేశారా, లేక ప్రమాదవశాత్తు గెడ్డలో పడి చనిపోయాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News September 20, 2025

ఒంగోలు రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత

image

ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. హౌరా నుంచి బెంగళూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో అబ్దుల్ హుదూద్ వద్ద 1.5 కిలోల గంజాయిని గుర్తించారు. మరో 38 చిన్న గంజా ప్యాకెట్లు దొరికాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని GRP పోలీసులకు అప్పగించారు.

News September 20, 2025

గద్వాల: కూతురిని పండగకు పిలిచేందుకు వెళ్లి.. తండ్రి మృత్యువాత

image

కూతురుని పండగకి పిలిచేందుకు వెళ్లిన వ్యక్తి రైలు ఢీకొని మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజోలి వాసి మల్లయ్య(55) తన చిన్నకూతురుని పెద్దల అమావాస్య పండగకు తీసుకురావడానికి ఉందానగర్‌కి వెళ్లాడు. అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా కాలు జారి కిందపడ్డాడు. అదే సమయంలో వచ్చిన ఓ రైలు ఆయనను ఢీకొనటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.