News April 10, 2025
రాయచోటిలో రెండు రోజులు ట్రాఫిక్ మళ్లింపు

ఈ నెల11న కడప జిల్లా ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఈ నెల 11ఉదయం10 గంటల నుంచి 12 వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని చెప్పారు
Similar News
News July 7, 2025
ఖమ్మం జిల్లాలో విషాదం.. వ్యవసాయ కూలీ మృతి

కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మారుతి పెద్ద గోపయ్య(56) వ్యవసాయ కూలీ. ఓ రైతు పొలానికి నారు మడిలో యూరియా చల్లేందుకు వెళ్లారు. ఈ సమయంలో గుండెపోటుతో అస్వస్థతకు గురి కాగా, తోటి కూలీలు వెంటనే సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మరణించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు.
News July 7, 2025
వికారాబాద్: మార్పు రావాలి.. రక్షణ కావాలి!

అనంతగిరి.. చుట్టూ అడవులు, పెద్ద సరస్సులు కలిగిన పర్యాటక ప్రాంతం. బోటింగ్, ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి టూరిస్టులు తరలివస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ టూర్ విషాదాన్ని నింపుతోంది. 2023లో కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో ఈతకోసం దిగి ముగ్గురు యువకులు మృతి చెందగా.. ఇటీవల సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ఇద్దరు మహిళలు చనిపోయారు. రక్షణ చర్యలు పటిష్టం చేస్తే ప్రాణ నష్టం జరగదని టూరిస్టుల మాట. దీనిపై మీ కామెంట్?
News July 7, 2025
చింతపల్లి: పాఠశాల పైకప్పుపై టార్పాలిన్ కవర్లు

చింతపల్లి మండలం చౌడురాయిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలు కురిసినప్పుడు తరగతి గదులు, వరండాల్లో వాన నీటితో నిండిపోతుంది. ఇలా నీటిలోనే విద్యార్థులు విద్యను అభ్యసించడంతో తల్లిదండ్రులు పైకప్పుపై టార్పాలిన్ కవర్లను వేసి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. సుమారు 30 ఏళ్ల క్రితం పాఠశాల భవనం నిర్మించారని, మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.