News March 12, 2025
రాయచోటిలో వైసీపీ జెండా ఆవిష్కరణ

రాయచోటిలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైసీపీని స్థాపించినట్లు చెప్పారు.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్‌లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్‌లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
NZB: విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తా: కవిత

విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శనివారం రాత్రి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇతర అంశాల గురించి చర్చించారు.
News November 9, 2025
జన్నారం: గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుడు గుండా శ్రావణ్ మృతి చెందారు. శనివారం బాదంపల్లి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు ఆయన గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ మృతితో ఆయన కుటుంబంతో పాటు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.


