News January 8, 2026

రాయ‘చోటిస్తారా’?

image

రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేయడంతో ఆ ప్రాంత ప్రజలు నిరాశలో ఉన్నారు. అయితే ప్రస్తుతం పెండిగ్లో ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగల్లు ప్రాజెక్ట్‌లో పెండింగ్ పనుల పూర్తి, చిన్నమండెంలో నిర్మితమై ఉన్న రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు చేరేలా చర్యలు తీసుకోవాలి. గువ్వలచెరువు ఘాట్ టన్నెల్, మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రస్తుతం రియలెస్టేట్ దెబ్బతింటోంది కాబట్టి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఆశిస్తున్నారు.

Similar News

News January 21, 2026

నరసాపురం స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

image

నరసాపురం స్టీమర్ రోడ్డులోని మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల అరుదైన మైలురాయిని అందుకుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVRM) మూల్యాంకనంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా హెచ్ఎం సుధీర్ బాబు, ఉపాధ్యాయులను ఎంఈవోలు పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ అభినందించారు. పాఠశాల పారిశుద్ధ్యం, హరిత వనరుల నిర్వహణపై అధికారులు ప్రశంసలు కురిపించారు.

News January 21, 2026

అనంతపురంలో స్టార్ క్రికెటర్ సందడి

image

భారత స్టార్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మంగళవారం అనంతపురానికి విచ్చేశారు. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో జరుగుతున్న రంజీ పోటీల్లో పాల్గొనేందుకు ఇతర ఆటగాళ్లతో కలిసి నగరంలో పర్యటించారు. నితీశ్ కుమార్ రెడ్డి అనంతపురం వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఆంధ్ర-విదర్భ జట్ల మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. ఆయన ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News January 21, 2026

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర.. షెడ్యూల్ ఇదే

image

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.

➱ఫిబ్రవరి 20న (శుక్రవారం) అమ్మవారి నేత్రోత్సవం

➱22న (ఆదివారం) జాతర ప్రారంభం

➱23న (సోమవారం) పసుపు, కుంకుమ, ముర్రాటలతో మొక్కులు చెల్లిస్తారు

➱24న (మంగళవారం) రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.

చివరి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.