News May 22, 2024
రాయచోటి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం రాయచోటిలోని జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిటెండెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. ఈనెల 24 నుంచి జూన్ 1వరకు జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News September 11, 2025
ప్రొద్దుటూరు: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ప్రొద్దుటూరు జార్జ్ కారొనేషన్ క్లబ్లో బుధవారం ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి అండర్ 14, 17 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభను చూపిన 40 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాజుపాలెం ఎంఈవో ప్రసాద్, హెచ్ఎం ఇమామ్ హుస్సేన్, పీడీలు పోటీలను పర్యవేక్షించారు.
News September 10, 2025
కడప: కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కడప జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేపాల్‌లో ఉన్న ఏపీ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News September 10, 2025
కడప జిల్లా పోలీసు శాఖకు నూతన జాగీలం

జిల్లా పోలీసు శాఖకు నూతన జాగిలం సోనును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం నూతన జాగీలాన్ని పరిశీలించారు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ జాగీలం వచ్చిందని ఎస్పీ తెలిపారు. నేర పరిశోధన, పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందిందన్నారు. బిల్జియం మల నాయిస్ జాతికి చెందిన జాగీలమని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ సిబ్బందికి సూచనలు చేశారు.