News November 10, 2025

రాయచోటి కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం

image

ఇవాళ ఉదయం రాయచోటి కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు జిల్లా కలెక్టరేట్‌కు రాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చనన్నారు. అర్జీ స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. అర్జీలు స్థానికంగా పరిష్కారం కాని ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిందిగా తెలిపారు.

Similar News

News November 10, 2025

శివయ్యను ఎలా పూజిస్తే సంతోషిస్తాడు?

image

శివుడికి కొన్ని పూలంటే చాలా ఇష్టం. మారేడు దళాలతో పూజిస్తే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడట. శంఖం పూలు సమర్పిస్తే సంతోషపడతాడట. నాగమల్లి పూలతో పూజిస్తే పుణ్య కార్యాలు చేసిన ఫలితం ఉంటుందట. సంపెంగ పూలు పెడితే ప్రసన్నమవుతాడని, జిల్లేడు పూలు సమర్పిస్తే, పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఇష్టమైన వాటితో ఆరాధిస్తే శివయ్య సంతోషించి, శుభాలు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు.

News November 10, 2025

గద్వాల డీసీసీ అధ్యక్ష సీటు ఎవరికి?

image

నడిగడ్డలో గద్వాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవిపై చర్చ నడుస్తోంది. ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి, సెక్రటరీ సంపత్ కుమార్ పార్టీ శ్రేణుల అభిప్రాయాలు స్వీకరించారు. అధ్యక్ష పదవికి 13 మంది దరఖాస్తు చేసుకోగా, రాజీవ్ రెడ్డి, నల్లారెడ్డి, తిరుపతయ్య పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది.

News November 10, 2025

ఏపీ టుడే

image

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.