News January 13, 2026

రాయచోటి జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేధించాలని వినతి

image

రాయచోటి జిల్లా డిమాండును ప్రభుత్వానికి నివేదించాలని రాయచోటి జిల్లా సాధన సమితి నాయకులు మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్ని విధాలుగా వెనుకబడ్డ రాయచోటిని జిల్లా చేస్తే మన ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని సాధన సమితి నాయకులు మంత్రికి వివరించారు.

Similar News

News February 20, 2026

ఇన్‌స్టాలో ఫొటో చూసి.. వెతుక్కుంటూ వచ్చి చంపాడు

image

TG: గృహహింస కేసు, బాధతో తల్లి మరణం, లుకౌట్ నోటీస్, మరో వివాహం చేసుకుందన్న కోపంతో గర్భిణి అయిన మాజీ భార్యను కడతేర్చాడా కర్కోటకుడు. మహేశ్-సునీత 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత అతడు కెనడా వెళ్లగా గొడవలై భర్త, అత్తమామలపై ఆమె గృహహింస కేసు పెట్టారు. ఇన్‌స్టాలో ఫొటో చూసి మరొకరిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్నాడు. మరో ఫొటోతో HYD వనస్థలిపురంలోని ఆమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చి కిరాతకంగా హత్య చేశాడు.

News February 20, 2026

ఏలూరు: మహిళ కడుపులో 8 కిలోల కణితి తొలగింపు

image

జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స గురువారం జరిగింది. బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఓ మహిళ కడుపులో 8 కిలోల కణితి ఉన్నట్లు వైద్యుడు సంకు మురళి గుర్తించారు. ల్యాపరో స్కోప్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి కణితి తొలగించామన్నారు. కడుపు నొప్పితో సదరు మహిళా ఆసుపత్రికి వచ్చిందని, ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

News February 20, 2026

రూ.10 కోట్లు ఇవ్వు.. రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

image

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్‌వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్‌కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.