News August 7, 2024
రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేట్ వైద్యం

రాయచోటి ప్రాంతీయ వైద్యశాల వైద్యులు కార్పొరేట్ వైద్యానికి తీసిపోని విధంగా అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. ప్రముఖ వైద్య నిపుణులు సీనియర్ సివిల్ సర్జన్ డి లక్మీప్రసాద్ ఆధ్వర్యంలోని, వైద్య బృందం కడుపునొప్పితో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక నిరుపేద రోగి కడుపులోని 12 కణుతులను తొలగించి పేదరోగికి ప్రాణదానం చేశారు.
Similar News
News September 15, 2025
కడప: తండ్రి కోసం ఐపీఎస్ అయ్యాడు.!

తన తండ్రి కలను తీర్చడానికి కష్టపడ్డ వ్యక్తి కడప జిల్లా నూతన SP నచికేత్ షలేకే. ఈయన పూణేలోని ప్రింళై గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు విశ్వనాథ్, చంద్రసేన ఇద్దరూ ఉపాధ్యాయులే. తాను ఐపీఎస్ కావడం తన తండ్రి కల అని, దాని కోసం చాలా కష్టపడ్డానని ఓ ఇంటర్వూలో ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు విఫలం చెంది 2019లో మూడో ప్రయత్నంలో సివిల్స్‌లో సెలెక్ట్ అయ్యారు. ఇవాళ 10 గంటలకు కడప ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
News September 15, 2025
కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బంది బదిలీ.!

కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 39 మందికి స్థాన చలనం కలిగించారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. మరో ఏడుగురికి అటాచ్మెంట్ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శనివారం ఎస్పీతోపాటు పలు జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.
News September 15, 2025
కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బంది బదిలీ.!

కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 39 మందికి స్థాన చలనం కలిగించారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. మరో 7మందికి అటాచ్మెంట్ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శనివారం కడప ఎస్పీతోపాటు పలు జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.