News February 12, 2025

రాయచోటి: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

భార్యను క్రూరంగా హత్యచేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రాయచోటి 5వ అదనపు జిల్లా జడ్జి తీర్పిచ్చారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి ధనంజయ(31) తన భార్య లక్ష్మీదేవిని 2017 ఫిబ్రవరిలో హత్య చేశాడు. అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. కోర్టు పూర్వాపరాలను విచారించింది. నేరం రుజువు కావడంతో ధనంజయకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం జడ్జి కృష్ణన్ కుట్టి తీర్పునిచ్చారు.

Similar News

News February 12, 2025

సరూర్ నగర్: రేపు కబడ్డీ జట్ల ఎంపిక

image

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు రేపు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు ఎంపిక ఉంటుందని, 16 ఏళ్లలోపు బాల బాలికలు ఆధార్ కార్డుతో ఎంపికకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు వికారాబాద్ జిల్లాలో జరిగే 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా పోటీల్లో ఆడుతారన్నారు.

News February 12, 2025

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు.. ఇవి తీసుకెళ్లండి!

image

TG: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసే వారు మీసేవ సెంటర్లకు తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.50. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

News February 12, 2025

శంషాబాద్ విమానాశ్రయానికి 6 పుష్పక్ బస్సులు

image

శంషాబాద్ విమానాశ్రయానికి మరిన్ని పుష్పక్ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఈడీ రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:55 గం.కు మొదటి బస్సు, రాత్రి 11:55 గంటలకు ఆఖరి బస్సు ఉంటుందన్నారు. నేటి నుంచి విమానాశ్రయం మీదుగా 6 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11:50 గంటలకు చివరి బస్సు ఉంటుందన్నారు.

error: Content is protected !!