News April 4, 2025
రాయచోటి : వాహనంపై స్టంట్ చేసిన యువకులపై కేసు

రాయచోటిలో స్కూటీపై వేగంగా, నిర్లక్ష్యంగా స్టంట్‌లు చేసిన ఇద్దరి యువకులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా వారికి వాహనం ఇచ్చిన యజమానిపైనా కేసు నమోదైంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు ఎవరూ బైక్స్ ఇవ్వొద్దని, వారు అతి వేగంగా ప్రయాణించి ప్రమాదం జరిగితే అది ఆ తల్లిదండ్రులకి బాధను కలిగిస్తుందని సూచించారు.
Similar News
News April 10, 2025
రాణా: వైద్యుడి నుంచి నరహంతకుడి వరకు..

26/11 కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ <<16048549>>రాణా<<>> ఇస్లామాబాద్ వాసి. కాలేజీ రోజుల్లో మరో కుట్రదారు డేవిడ్ హెడ్లీతో పరిచయం ఏర్పడింది. పాక్ ఆర్మీలో డాక్టరైన రాణా 1997లో మేజర్ హోదాలో రిటైరై కెనడా వెళ్లి ఆ దేశ పౌరుడిగా మారాడు. అనంతరం USAలో వీసా ఏజెన్సీ పెట్టగా హెడ్లీ ఈ దాడుల కోసం అతడిని కలిశాడు. దీంతో ముంబైలో రాణా వీసా ఏజెన్సీ తెరవడంతో హెడ్లీ ఆ వంకతో తరుచూ వచ్చి లొకేషన్లు రెక్కీ చేసి నరమేధ వ్యూహ రచన చేశాడు.
News April 10, 2025
శ్రీ సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. మొత్తం 120 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద సూపరింటెండెంట్ హనుమంతయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.
News April 10, 2025
‘అమ్మ నన్ను చంపేస్తోంది’.. అని మెసేజ్ చేసి..

AP: తిరుపతి(D) చంద్రగిరి(M)లో బాలిక అనుమానాస్పద<<16045416>>మృతిపై <<>>ఆమె ప్రియుడు అజయ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ‘మూడేళ్లు ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నాం. ఆమె పేరెంట్స్ నాపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ చేయించారు. విషం పెట్టి వాళ్ల అమ్మ, మామ, తాత చంపాలని చూస్తున్నారని ఆమె మెసేజ్ చేసింది. తర్వాతి రోజే చనిపోయింది’ అంటూ బాలికతో చేసిన చాటింగ్‌ను పంచుకున్నాడు.