News March 29, 2024
రాయచోటి: విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన కమ్మపల్లెలో గురువారం విద్యుదాఘాతంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మట్లి మహేశ్ నాయుడు (30) మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. మహేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో ప్లగ్ బాక్స్‌లో పిన్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Similar News
News September 5, 2025
కడప జిల్లా విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రివర్గం ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కడప జిల్లాలో 2,560 MW సామర్థ్యం కలిగిన పలు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. జమ్మలమడుగు, ముద్దనూరు మండలాల్లోని గ్రామాల్లో100 MW విండ్ పవర్ ప్రాజెక్టులు, మైలవరం మండలంలో 60 MW హైబ్రిడ్ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, కొప్పోలులో 2400 MW పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
News September 5, 2025
తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: కలెక్టర్

కడప జిల్లా విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం పట్ల స్పష్ఠమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమైనదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాప్రదాతలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
News September 5, 2025
కొండాపురంలో పూణే -కన్యాకుమారి రైలు హాల్టింగ్

ప్రయాణికుల సౌకర్యార్థం కడప MP వైయస్ అవినాశ్‌రెడ్డి వినతి మేరకు జిల్లాలోని రైల్వే స్టేషన్‌లో కొత్తగా 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూణే -కన్యాకుమారి -పూణే (16381/82) మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలు కొండాపురంలో ఒక నిమిషం పాటు ఆగనుంది. (17622) తిరుపతి- ఔరంగాబాద్ రైలుకు ఎర్రగుంట్లలో హాల్టింగ్ కల్పించారు. ఆయా ప్రాంతాల ప్రయాణికులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.