News July 14, 2024

రాయచోటి: వెలుగులోకి భారీ మోసం

image

రాయచోటిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. కె.రామాపురంలో ఓ మహిళ 20 ఏళ్లుగా చీటీలు నడిపింది. ఈ క్రమంలో 70 మందికి పైగా రూ. 2.75 కోట్లు చీటీలు కట్టారు. గడువు తీరినా డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

Similar News

News March 2, 2026

కడప జిల్లాలో గత నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఎంతంటే.!

image

జిల్లాలో గత నెలలో 5,329 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ప్రభుత్వానికి రూ.20.28 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం రూ.కోట్లలో ఇలా ఉంది. ఏప్రిల్-5274-20.86, మే-6461-22.98, జూన్-6382-22.12, జులై-6673-25.51, ఆగస్ట్-5486-21.91, సెప్టెంబర్-5988-23.81, అక్టోబర్-5988-21.73, నవంబర్-5527-22.67, డిసెంబర్-5907-23.35, జనవరిలో 5898 – రూ.26.45 కోట్లు వచ్చింది.

News March 1, 2026

వల్లూరు: చంద్రగ్రహణం సందర్భంగా పుష్పగిరి ఆలయం మూసివేత

image

వల్లూరు (M) పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల మూడో తేదీన ఉదయం 6 గంటల నుంచి నాలుగో తేదీ ఉదయం ఏడున్నర వరకు తలుపులు మూసివేసి ఉంటుందని దేవాలయ ఈవో శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహ వచనం స్వామివారికి విశేష అభిషేకం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.

News March 1, 2026

పుష్పగిరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

image

వల్లూరు మండలం పుష్పగిరి నదిలో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు డ్యాం చూడటానికి వచ్చి సరదాగా నదిలో దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నదిలో కొట్టుకుపోయారు. అందులో సురేంద్ర(25) అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు శ్రీనాథ్, చైతన్యలు గల్లంతయ్యారు. శ్రీనాథ్ రైల్వే కొండాపురానికి చెందిన వ్యక్తిగా సురేంద్ర తెలిపారు. మృతదేహాల కోసం స్థానికులు గాలిస్తున్నారు.