News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
Similar News
News November 4, 2025
ADB: పత్తి రైతుకు మరో కష్టం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఓవైపు ప్రకృతి ముంచుతుంటే మరోవైపు కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరానికి 7 క్వింటాళు కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన పత్తి రైతులకు కష్టంగా మారింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనేవారు. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 7 క్వింటాళు కొంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ADBలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
News November 4, 2025
WGL: డీఈవోల బాధ్యతలో గందరగోళం!

ఉమ్మడి జిల్లాలో DEO బాధ్యతల విషయంలో గందరగోళం నెలకొంది. JNG, MLG జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించగా, BPHL, MHBD, WGL జిల్లాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు విద్యా పరిపాలన అప్పగించడం సరికాదని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి పూర్తి స్థాయి డీఈవోలను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 4, 2025
నెత్తుటి రహదారి.. 200 మందికి పైగా మృతి

TG: నిన్న <<18186227>>ప్రమాదం<<>> జరిగిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి(NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని 46 కి.మీ. రహదారిపై ఎక్కడపడితే అక్కడే గుంతలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 2018 నుంచి చోటు చేసుకున్న ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణించగా సుమారు 600 మంది గాయాలపాలయ్యారు. తాజాగా అన్ని అడ్డంకులు తొలిగి రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడంతో పనులు ప్రారంభం కానున్నాయి.


