News February 28, 2025

రాయపోల్: దీపం అంటుకొని ఇళ్లు దగ్ధం.. రోడ్డున పడిన కుటుంబం

image

విద్యుత్ ప్రమాదంలో పెంకుటిళ్లు దగ్ధమైన ఘటన రాయపోల్ మండలం పెద్దఆరేపల్లిలో రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కోంపల్లి శంకరయ్య భార్య లలితతో పాటు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రి ఇంట్లో దేవతలకు దీపం వెలిగించి ఇంటి బయట నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోఇళ్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Similar News

News December 19, 2025

ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ కనిపిస్తే ఏం చేయాలంటే?

image

ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో స్పాటింగ్ కనిపించడం సాధారణమే కానీ కొన్నిసార్లు అది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. వెంటనే వైద్యులను సంప్రదించి స్కానింగ్ చేయించుకొని గర్భస్థ పిండం ఎదుగుదలను పరీక్షించాలి. వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా కొన్నిసార్లు స్పాటింగ్‌కి కారణం కావచ్చు. సమస్యను బట్టి మందులు ఇస్తారు. స్పాటింగ్‌తో పాటు కళ్లు తిరగటం, కడుపులో, భుజాల్లో నొప్పి ఉంటే వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి.

News December 19, 2025

మానసిక ప్రశాంతతను పెంచే శివ నామం

image

‘ఓం స్థిరాయ నమః’ – ఈ సృష్టిలో కాలక్రమేణా అన్నీ మారుతుంటాయి. కొన్ని నశిస్తాయి. కానీ శివుడు అలా కాదు. ఏ మార్పు లేకుండా సర్వావస్థలందు సర్వకాలం స్థిరంగా ఉంటాడు. ఆయన జ్ఞానం, శక్తి, ఉనికి నిరంతరమైనవి. ఆయన పుట్టుక, పెరుగుదల, మరణం లేని ఆ స్థిరత్వాన్ని ఆశ్రయించడం వల్ల మనస్సులోని అలజడులు తగ్గి, మనకు పరిపూర్ణమైన మానసిక ప్రశాంతత, ధైర్యం లభిస్తాయి. ఆయన మార్పులేని అనంత తత్వానికి ఈ నామం నిదర్శనం. <<-se>>#SHIVANAMAM<<>>

News December 19, 2025

నాగర్‌కర్నూల్‌ను వణికిస్తున్న చలి

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో అత్యల్పంగా 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లిలో 10.4, తోటపల్లిలో 10.5, అమ్రాబాద్‌లో 10.6, లింగాలలో 10.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.