News July 5, 2025
రాయపోల్: వడ్డేపల్లిలో మరోసారి చిరుతపులి కలకలం

రాయపోల్ మండలం వడ్డేపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇంతకు ముందు చిరుతపులి ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించినా పట్టుకోవడంలో విఫలం అయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామానికి చెందిన నవీన్ కుమార్ శుక్రవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. సమీపంలో చిరుత కనిపించడంతో భయాందోళను గురయ్యాడు. సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించాడు.
Similar News
News July 5, 2025
చేయూతను అందించడమే పీ4 లక్ష్యం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమంపై శుక్రవారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గ్రామాల్లో 10% మార్గదర్శులను, దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాలను ఎంచుకుని వారికి పీ4 ఉద్దేశ్యం వివరించాలన్నారు. దిగువ స్థాయి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక బాధ్యత కింద చేయూత అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
News July 5, 2025
SUPER.. టాప్ 5లో జగిత్యాల విద్యార్థినికి చోటు

బాసర, MBNR IIITల్లో JGTL జిల్లా నుంచి 66 మంది విద్యార్థులు సెలెక్ట్ అయినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 1,690 సీట్లకు గాను జిల్లా నుంచి విద్యార్థిని వర్షిణి టాప్ 5లో ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందిస్తున్నారు. అలాగే ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 7, 8, 9 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అటెండ్ కానివారు తమకు కేటాయించిన సీట్లు కోల్పోయే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
News July 5, 2025
విజయవాడలో ఆదిత్య ఫార్మసీ MD ఆత్మహత్య..!

విజయవాడ అయోధ్య నగర్‌లోని క్షత్రియ భవన్‌లో ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహారాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే కారణమని కుటుంబీకులు చెబుతున్నారు. సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.