News January 7, 2026
రాయలసీమ లిఫ్ట్ అంటూ అడ్డగోలుగా పనులు చేశారు: CBN

AP: అనుమతులు లేనందునే రాయలసీమ లిఫ్ట్‌ను NGT నిలిపేసిందని CM CBN స్పష్టం చేశారు. ‘రూ.3,528 కోట్లతో దీన్ని చేపట్టారు. రూ.2,500 కోట్లు ఖర్చుచేశారు. అడ్డగోలుగా పనిచేశారు. కాంట్రాక్టరుకే రూ.900 కోట్లిచ్చారు. ముచ్చుమర్రి నుంచి నీటి తరలింపు అవకాశమున్నా దీన్ని చేపట్టారు. NGT జరిమానా వేసింది’ అని పేర్కొన్నారు. అబద్ధం వందసార్లు చెబితే నిజమైపోదని, తనపై బురదచల్లితే వారికే నష్టం అని అన్నారు.
Similar News
News February 9, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 09, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.29 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 9, 2026
పాలసీలు ఎల్లప్పుడూ ఆ రాష్ట్రాలకు అనుకూలంగా ఉండొద్దు: చంద్రబాబు

దేశంలో పనితీరు మెరుగ్గా లేని రాష్ట్రాలు కేంద్రం ఆదాయ వికేంద్రీకరణలో అధిక పన్ను వాటాను పొందుతున్నాయని ఏపీ CM చంద్రబాబు అన్నారు. ఇది మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. అయితే ఉద్దేశపూర్వకంగా కేంద్రం ఎవరికీ అన్యాయం చేయదన్నారు. వెనుకబాటుతనం, జనాభా వంటి అంశాలు ప్రామాణికమని తెలిపారు.
News February 9, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


