News October 31, 2025

రాయలసీమ వర్సిటీలో కత్తితో బీటెక్‌ విద్యార్థి హల్‌చల్‌

image

కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టల్‌లో గురువారం రాత్రి ఓ విద్యార్థి కత్తి పట్టుకొని హల్‌చల్ చేశాడు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు అజయ్ నాయక్, బాలాజీ నాయక్‌ల మధ్య ఘర్షణ జరగ్గా అజయ్ కత్తి పట్టుకొని బాలాజీ రూమ్ వద్దకు వెళ్లి బెదిరించాడు. వర్సిటీ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని గొడవను అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 1, 2025

పుష్ప, KGF కూడా అలా రిలీజ్ చేస్తారా?

image

‘బాహుబలి’ యూనివర్స్‌లో వచ్చిన 2 భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా 2 పార్టులుగా వచ్చి హిట్ అయిన సినిమాలపై చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2, ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన KGF, KGF-2ను కూడా ట్రిమ్ చేసి ఇలా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?

News November 1, 2025

తిరుపతి: ఎకరాకు 3 బస్తాల యూరియా

image

తిరుపతి జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, అధికారులతో సమీక్షించారు. యూరియా కార్డుల ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు 3బస్తాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.

News November 1, 2025

సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని 37 పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కుంగ్ ఫు, జోడో, కలర్ కలరిపయట్టు నేర్పించే ఏజెన్సీలు ఈనెల 3వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని రెండో అంతస్తులో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ఎంపికైన వారు విద్యార్థులకు కరాటే నేర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.