News January 9, 2026
రాయవరంలో సీఎం సభస్థలిలో మహిళకు చోటు కరువు

రాయవరంలో శుక్రవారం నిర్వహించిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మహిళలకు సమస్తలంలో కూర్చోవడానికి కుర్చీలు లేక నేలపై కూర్చుని ఇబ్బందులు పడ్డారు. సీఎం చంద్రబాబు ప్రసంగం వినడానికి తరలివచ్చిన మహిళలకు పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. చివరకు కుర్చీల కోసం పార్టీ కార్యకర్తలు లేచి మహిళలకు కుర్చీలు ఇవ్వాలని నాయకులు సూచించటం కొసమెరుపు.
Similar News
News February 5, 2026
అణు ఒప్పందంపై ఇరాన్, అమెరికా చర్చలకు డేట్ ఫిక్స్

అణు ఒప్పందంపై చర్చించేందుకు ఇరాన్, యూఎస్ ప్రతినిధుల భేటీకి తేదీ ఖరారైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మస్కట్‌లో చర్చలు జరగనున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ ట్వీట్ చేశారు. అంతకుముందు అణు ఒప్పందానికి రాకపోతే దాడి తప్పదని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఘాటుగానే <<19025631>>బదులిచ్చినా<<>> తాజాగా చర్చలకు అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.
News February 5, 2026
మన్యం జిల్లా పోలీస్ విభాగంలో కృత్రిమ మేధస్సు: ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు AI సేవలు విశ్వసనీయ సహాయకుడిగా ఉపయోగపడుతుందని ఎస్పీ మాధవ్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పాల్గొన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున పోలీస్ శాఖకు కూడా కృత్రిమ మేధస్సు తోడ్పడుతుందన్నారు. సాఫ్ట్‌వేర్‌తో ఏ ప్రాంతాల్లో నేరాలు జరుగుతున్నాయో అంచనాలకు దోహదపడుతుందన్నారు.
News February 5, 2026
కృష్ణా: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు GOOD NEWS

ప్రయాణికుల రద్దీ మేర ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అనకాపల్లి(AKP)- సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. నం.07041 SC- AKP రైలు ఈ నెల 22న, నం.07042 AKP- SC రైలు 23న నడుపుతున్నామన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ AC, స్లీపర్, జనరల్ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని వెల్లడించారు.


