News October 12, 2025
రాయవరం ఘటనలో పదికి చేరిన మృతుల సంఖ్య

రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఆదివారం ఉదయం అనపర్తికి చెందిన చిట్టూరి యామిని చికిత్స పొందుతూ మరణించగా, తాజాగా వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ కూడా మృతి చెందారు. దీంతో ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పదికి చేరుకుంది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News October 12, 2025
Op Sindoor: NSEపై ఒకేరోజు 40 కోట్ల సైబర్ అటాక్స్

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)పై రోజూ 17కోట్ల సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో ఏకంగా ఒకేరోజు 40 కోట్ల దాడులు జరిగాయి. వీటిని సమర్థంగా అడ్డుకున్నామని, ఎలాంటి నష్టం జరగలేదని NSE వర్గాలు తెలిపాయి. తమ రెండు సైబర్ డిఫెన్స్ సెంటర్లలోని సాంకేతిక బృందాలు 24/7 పని చేస్తున్నట్లు చెప్పాయి. Op Sindoor సమయంలో తమ సైట్‌ను ఫారినర్స్ యాక్సెస్ చేయకుండా తాత్కాలికంగా రిస్ట్రిక్ట్ చేశామన్నాయి.
News October 12, 2025
దామన్న కుటుంబానికి అండగా ఉంటాం: CM రేవంత్

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి అవసరమైన సమయంలో రాజకీయంగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో దామన్న సంతాప సభలో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటే RDRకు అమితమైన ప్రేమ అని కొనియాడారు. కాంగ్రెస్ అధిష్టానం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు, MLAలు, MLCలు పాల్గొన్నారు.
News October 12, 2025
బాపట్లలో రేపు ప్రజావేదిక: కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్ వద్ద సోమవారం PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అర్జీలపై జిల్లా అధికారులు, కలెక్టర్ సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రెవెన్యూ డివిజన్లు, మండల MRO కార్యాలయాలలో కూడా అర్జీలు తీసుకుంటారు. ప్రజలు 1100 నంబర్ లేదా Meekosam.ap.gov.inలో అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.