News January 9, 2026
రాయవరానికి భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు

సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించనున్నారు. ఈ బహిరంగ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. సీఎం ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. సభా ప్రాంగణం పసుపుమయంగా మారింది.
Similar News
News February 14, 2026
HYD: 3 నెలల్లో ఫుట్‌పాత్‌లు క్లియర్!

పాదచారుల భద్రతను మెరుగుపరిచేందుకు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలని TG హైకోర్టు GHMCని ఆదేశించింది. HYDలో ఉన్న ఫుట్‌పాత్‌లను 3 నెలలోగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోర్టు స్పష్టం చేసింది. బాటసారులకు ఆటంకం కలిగిస్తున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టంచేసింది.

తూ.గో: మరణంలోనూ జీవించిన చిన్నారి..

అమలాపురం మండలం పేరూరుకు చెందిన బడుగు భరత్ (8) ఈనెల 10న పాఠశాలకు వెళ్తుండగా బైక్ ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన భరత్ విశాఖలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. శుక్రవారం ఆస్పత్రిలో మృతి చెందాడు. విషాదంలోనూ తల్లిదండ్రులు సామాజిక బాధ్యత చాటారు. తమ బిడ్డ ఇతరుల రూపంలో జీవించాలని భరత్ నేత్రాలు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు దానం చేశారు. పేరూరులో శుక్రవారం భరత్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.