News September 22, 2025

రాయికల్: ఆదివాసి తోటి సంక్షేమ జిల్లా అధ్యక్షుడిగా ప్రసన్నకుమార్

image

ఆదివాసి తోటి సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాయికల్‌కు చెందిన కురిసెంగ ప్రసన్నకుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ అత్రం కమల్ మనోహర్ తెలిపారు. తోటి కుల హక్కుల కోసం ప్రసన్నకుమార్ చేసిన కృషిని గుర్తించి ఈ పదవి అప్పగించినట్లు చెప్పారు. పీటీజీ వర్గాల అభివృద్ధి, ఫేక్ కుల సర్టిఫికెట్లపై చర్యలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.

Similar News

News September 22, 2025

VKB: జాతీయ రహదారుల భూసేకరణ పూర్తి చేయాలి: కలెక్టర్

image

జాతీయ రహదారుల నిర్మాణాలకు భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జాతీయ రహదారుల భూసేకరణపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రానున్న జాతీయ రహదారుల నిర్మాణాలకు అధికారులు వెంటనే భూసేకరణ పనులను పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు.

News September 22, 2025

సీఎం సారూ.. మేడారం ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి!

image

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించేందుకు CM రేవంత్ మంగళవారం మేడారం రానున్నారు. కాగా, ప్రతి జాతర సమయంలో భక్తులను ట్రాఫిక్ జామ్ ప్రధాన సమస్యగా వేధిస్తుంటుంది. తాడ్వాయి-మేడారం, పస్రా-మేడారం రోడ్డు వెడల్పు చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం ఈ మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీఎం స్పందించాలని కోరుతున్నారు.

News September 22, 2025

విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

image

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.