News August 22, 2025
రాయికల్: ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడి మృతి

రాయికల్ మం. అల్లిపూర్‌కు చెందిన బరతాల రాజేందర్(30) అనే దివ్యాంగుడు RTC బస్సు ఢీకొని మృతిచెందినట్లు ఏఎస్ఐ దేవేందర్ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి రాజేందర్ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
Similar News
News August 23, 2025
MHBD: 55 ప్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో 55 ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా తాత్కాలిక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేందర్ తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌మీడియట్ అర్హతతో నెలకు రూ.8 వేలు, ఆయాకు 7వ తరగతి అర్హతతో రూ.6 వేల వేతనం ఉంటుందన్నారు. ఆసక్తిగల మహిళలు జిల్లా విద్యా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News August 23, 2025
సురవరం రాజకీయ ప్రస్థానం ఇదే

CPI అగ్రనేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> MBNR జిల్లా కొండ్రావుపల్లిలో 1942 MAR 25న జన్మించారు. కర్నూలులో డిగ్రీ, HYD ఉస్మానియాలో LLB పూర్తి చేశారు. 1970లో AISF అధ్యక్షుడు, 1972లో AIYF అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1985, 90 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్, 1994లో డోన్ నుంచి పోటీ చేసి ఓడారు. 1998, 2004లో నల్గొండ పార్లమెంట్ నుంచి MPగా ఎన్నికయ్యారు. 2012లో CPI జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
News August 23, 2025
ఆగస్టు 23: చరిత్రలో ఈ రోజు

1872: ఆంధ్రరాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జననం
1964: సంగీత దర్శకుడు SA రాజ్‌కుమార్ జననం
1968: దివంగత గాయకుడు కేకే జననం
1969: సినీ నటుడు వినీత్ జననం
1994: ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి భారత మహిళ ఆరతి సాహా మరణం
2005: MGNREGAకు పార్లమెంట్ ఆమోదం
* జాతీయ అంతరిక్ష దినోత్సవం