News February 5, 2025

రాయికల్: ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలో జరిగింది. స్థానికుల పక్రారం.. ఇందిరానగర్ కాలనీకి చెందిన గాజుల మనోజ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈరోజు యువకుడు చెట్టుకి ఉరేసుకుని కనిపించాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 24, 2026

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్‌కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

News February 24, 2026

NRPT: SSC, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం నారాయణపేట కలెక్టరెట్‌లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.

News February 24, 2026

అష్టావక్రుడి గురించి మీకు తెలుసా?

image

అష్టావక్రుడంటే 8 వంకరలు ఉన్నవాడు. ఉద్దాలకుని శిష్యుడైన కహోలుని కుమారుడు ఆయన. తండ్రి వేద పఠనంలోని దోషాలను గర్భం నుంచే సరిదిద్దారు. అందువల్ల శాపగ్రస్థుడై 8 వంకరలతో జన్మించాడు. 12 ఏళ్లకే వేద పండితుడై తన తండ్రిని గతంలో ఓడించిన పండితులను వాదనలో ఓడించాడు. ‘జ్ఞానమే వృద్ధాప్యానికి కొలమానం. కానీ వయస్సు కాదు’ అని నిరూపించాడు. రూపం, వయస్సు, వంశాన్ని బట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని చాటిచెప్పారు.