News August 18, 2025
రాయికల్ : గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య

రాయికల్ (M) అయోధ్య గ్రామానికి చెందిన ఎడమల సాయిరెడ్డి (21) ఆదివారం ఉదయం గడ్డి మందు తాగగా, రాత్రి జగిత్యాల ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి రెడ్డి హైదరాబాదులో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఆదివారం ఉదయం స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Similar News
News August 18, 2025
కడపపై అనంతపురం సీనియర్ ఉమెన్ జట్టు విజయం

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ సీనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో కడప జట్టుపై అనంతపురం జట్టు 38 రన్స్ తేడాతో ఆదివారం విజయం సాధించింది. అనంతపురం జట్టు బ్యాటర్స్‌లో అర్షియ 68, నేహా 62 నాట్ ఔట్, బౌలర్లలో దండు చక్రిక, తేజస్విని చెరో 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర వహించారు. విజేతలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ భీమలింగరెడ్డి అభినదించారు.
News August 18, 2025
స్త్రీనిధి రుణాల మంజూరులో నిజామాబాద్ టాప్

స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024-25లో 2,953 మహిళా సంఘాలలోని 7,386 మంది సభ్యులకు రూ. 63.11 కోట్లు రుణాలు మంజూరు చేశారు. 2025-26లో రూ. 1,228.50 కోట్లు లక్ష్యం కాగా, ఆగస్టు 11 నాటికి 4,300 సంఘాలకు రూ. 357.41 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనితీరు జిల్లాలో మహిళా సాధికారతకు నిదర్శనం.
News August 18, 2025
RED ALERT: నేడు అత్యంత భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.