News December 24, 2025

రాయికల్ పెద్ద చెరువులో గుర్తుతెలియని శవం

image

రాయికల్ పట్టణం పెద్ద చెరువు సమీపంలోని తుమ్మకొలులో గుర్తుతెలియని యువకుడి శవం లభ్యం కావడంతో కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం మత్స్యకారులు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టీ-షర్ట్ ధరించి ఉన్నాడని, చేతిపై పచ్చబొట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 1, 2026

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు వివిధ పాఠశాలల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రహదారి నియమాలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు విద్యార్థులకు వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత పాటించాలని సూచిస్తూ విద్యార్థులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.

News January 1, 2026

గద్వాల: పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం గడువు పొడగింపు

image

2025- 26 విద్యాసంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతన దరఖాస్తుల గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించినట్లు గద్వాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పోస్ట్ మెట్రిక్ చదువుతున్నవారు htt://www.epass.cgg.gov.in వెబ్ సైటులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 1, 2026

X మొత్తం ఇదే.. ఇలా చేయడం నేరమే!

image

కొందరు X వేదికగా అమ్మాయిలు, సెలబ్రిటీల ఫొటోలను షేర్ చేస్తూ వారిని అసభ్యంగా (బికినీలో) చూపించాలని AI టూల్ ‘గ్రోక్’ను కోరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అది మెషీన్ కావడంతో అభ్యంతరకర ఫొటోలు సైతం ఎడిట్ చేసి ఇస్తోంది. అయితే ఇలా చేయడం ఇతరుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే. అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడం సైబర్ క్రైమ్ లాంటిదే. జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.