News October 9, 2025

రాయికల్: యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్‌లో ‘పుట్టింటి గౌరమ్మ’ ఎంపిక

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌లో రాయికల్ మండలం, అల్లిపూర్ గ్రామానికి చెందిన కునమల్ల సుమన్ రూపొందించిన ‘పుట్టింటి గౌరమ్మ’ షార్ట్ ఫిలిం ఎంపికైంది. కేవలం మూడు నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి సుమన్ స్వయంగా దర్శకుడు, నటుడు, నిర్మాతగా వ్యవహరించారు. తెలంగాణ సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేలా తీసిన ఈ చిత్రానికి ప్రభుత్వం గుర్తింపుతో పాటు పారితోషికాన్ని ప్రకటించింది.

Similar News

News October 9, 2025

ఈ నెల 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్

image

TG: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 290 జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో TG నుంచి HYD, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, HNK జిల్లాలున్నాయి. వీటితో పాటు WGLలో ఈ నెల 12న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 0-5 ఏళ్ల వయసు పిల్లలకు డ్రాప్స్ వేస్తారు. పోలియో కేసులు నమోదవుతున్న BAN వంటి దేశాల నుంచి INDకు రాకపోకల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News October 9, 2025

సిద్దిపేట: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు: మంత్రి

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం తరుపున మా వాదనలు బలంగా వినిపించామన్నారు. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నామని, సభలో మాట్లాడినప్పుడు అన్ని పార్టీల వారు స్పష్టంగా మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.

News October 9, 2025

VKB: సైబర్ మోసాల బారిన పడి ప్రజలు మోసపోవద్దు: సీఐ

image

సైబర్ మోసాల బారిన పడి ప్రజలు ఆర్థికంగా మోసపోవద్దని సీఐ వెంకట్ తెలిపారు. బుధవారం మోమిన్‌పేట్ సీఐ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్‌లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని ప్రకటన చూసి నవాబుపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పెట్టుబడి పెట్టి రూ.6 లక్షల వరకు మోసపోయారని తెలిపారు. మరో వ్యక్తి కూడా ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బు పెట్టి మోసపోయారన్నారు. ప్రకటనలు చూసి మోసపోవద్దన్నారు.