News October 30, 2025

రాయికల్: ‘రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు’

image

జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా వరి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత సూచించారు. రాయికల్ మండలం అల్లీపూర్, సింగారావుపేట, జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామాల్లోని ప్యాక్స్, ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతుల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News October 31, 2025

ఎవరు గెలిచినా చరిత్రే

image

WWC <<18154615>>సెమీఫైనల్లో<<>> ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. నవి ముంబై వేదికగా నవంబర్‌ 2న ఫైనల్ జరగనుంది. భారత్‌, సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌ గెలవలేదు. ఈసారి ఎవరు విజేతగా నిలిచినా అది ఆ జట్టుకు తొలి వరల్డ్‌కప్‌గా చరిత్రలో నిలుస్తుంది.

News October 31, 2025

జగిత్యాల: పర్యావరణ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్ లేదా కొత్త లీజు మంజూరుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ (SEIAA) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్‌సైట్‌లో (jagtial.telangana.gov.in) పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

News October 31, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర ₹2011, కనిష్ఠ ధర ₹1700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర ₹1820, కనిష్ఠ ధర ₹1775, వరి ధాన్యం (JSR) ధర ₹1950గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అటు మార్క్‌ఫెడ్ ద్వారా నేడు మక్కల కొనుగోళ్లు జరగలేదని పేర్కొన్నారు.