News March 18, 2025
రాయికల్: సెప్టిక్ ట్యాంకులో పడి వ్యక్తి మృతి

సెప్టిక్ ట్యాంకులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాయికల్ పట్టణంలో జరిగింది. ఎస్సై సుధీర్ రావు వివరాల ప్రకారం… కేశవనగర్‌కు చెందిన చిలివేరి కిరణ్ కుమార్ (54) అనే వ్యక్తి మద్యం మత్తులో ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడి మృతి చెందాడు. ఘటనపై మృతుడి భార్య చిలివేరి నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News March 18, 2025
జపాన్‌లో ‘దేవర’ స్పెషల్ షోకు అనూహ్య స్పందన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా జపాన్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈనెల 28న జపాన్‌లో ‘దేవర’ రిలీజ్ కానుండగా మేకర్స్ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. దీనికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. మూవీ అద్భుతంగా ఉందంటూ వారు SMలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్, మేకర్స్ ఈనెల 22న జపాన్‌కు వెళ్లనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.
News March 18, 2025
నల్గొండ: సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే: RM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను TGS RTC కార్గో ద్వారా రూ.151 చెల్లిస్తే భక్తుల ఇళ్ల వద్దకు చేరుస్తామని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రజలు తమ దగ్గరలో ఉన్న ఆర్టీసి లాజిస్టిక్స్‌లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 18, 2025
అలా చేస్తే పృథ్వీ షాను మించిన వారు లేరు: శశాంక్ సింగ్

ముంబై క్రికెటర్ పృథ్వీషాపై పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘షాతో నాకు 13ఏళ్ల పరిచయం. జైస్వాల్, గిల్ వంటివారు మంచి ఆటగాళ్లే. కానీ షా గనుక తిరిగి తన బ్యాటింగ్ బేసిక్స్‌ను గుర్తుతెచ్చుకుని ఆడితే తనను మించినవారు లేరు. కష్టం, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్.. వీటి విలువ తెలుసుకుని తను గాడిలో పడాలి’ అని అభిలషించారు.