News December 14, 2025
రాయికోడ్: 4 ఓట్లతో WIN

రాయికోడ్ మండలంలో ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా BRS బలపరిచిని అభ్యర్థి బేగరి ఈశ్వరమ్మ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మానమ్మా మీద 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News March 10, 2026
NRPT: ‘ప్రభుత్వ పథకాలు సులభంగా ప్రజలకు చేరాలి’

ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు సరైన లబ్ధిదారులకు సులభంగా చేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అదనపు కలెక్టర్లు ఫణీందర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యాచరణపై ఈనెల 12న ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News March 10, 2026
కామారెడ్డి: రూ.20 లక్షల విలువైన ఫోన్ల రికవరీ

కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 123 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్ చంద్ర వీటిని ప్రదర్శించారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. CEIR పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని గుర్తించినట్లు వివరించారు. ప్రజలు తమ ఫోన్ పోతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం బాధితులకు ఫోన్లను అందజేశారు.
News March 10, 2026
ఏలూరులో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు

రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా ఏలూరు కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి గండికొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో రాత్రి వరకు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కమిషనర్ తో పాటు సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. నిబంధనల ఉల్లంఘనలు, ఇతర అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


