News December 23, 2025
రావికమతం: చీరకు నిప్పంటుకున్న మహిళ మృతి

రావికమతం మండలం మేడివాడ పంచాయతీ శివారు అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన పాచిల చిలకమ్మా (60) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. సోమవారం సాయంత్రం చలి మంట కోసం ఆమె నిప్పు పెడుతుండగా చీరకు అంటుకుని శరీరం సగానికి పైగా కాలిపోయింది. పరిస్థితి విషమించడంతో అనకాపల్లి ఆస్పత్రి నుంచి సోమవారం రాత్రి విశాఖ KGHకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని ఆమె మనవడు అర్జున్ తెలిపారు.
Similar News
News December 31, 2025
నిడదవోలులో విషాదం.. పదేళ్ల బాలుడి మృతి

నిడదవోలు మండలం మునిపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత్తిలి భరత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సమిశ్రగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News December 31, 2025
నెల్లూరు : 2 నుంచి రీ సర్వే

నెల్లూరు జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రక్రియ జనవరి 2వ తేదీ నుంచి మొదలవుతోంది. AP రీసర్వే ప్రాజెక్టులో జిల్లా నందు 93 గ్రామాలు ఎంపిక చేశారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి 26 గ్రామాలు, కావలి డివిజన్ నుంచి 26, గూడూరు డివిజన్ నుంచి 14, నెల్లూరు డివిజన్ 27 గ్రామాలు కలిపి 357270.62 ఎకరములు రీసర్వే చేయనున్నారు. రైతులు రీసర్వేలో పాల్గొనాలని జేసీ వెంకటేశ్వర్లు, DD వై.నాగశేఖర్ కోరారు.
News December 31, 2025
JGL: జిల్లాలో తగ్గుముఖం పట్టిన నేరాలు

జిల్లాలో 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. పోలీసు గణాంకాల ప్రకారం.. 2024లో జిల్లా వ్యాప్తంగా 5,919 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 5,620కి తగ్గింది. గతేడాది కంటే ఈసారి 299 కేసులు తక్కువగా నమోదయ్యాయి. వివిధ పోలీస్ స్టేషన్ల వారీగా చూస్తే.. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 770 కేసులు నమోదయ్యాయి. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో 135 కేసులు నమోదయ్యాయి.


