News February 2, 2026
రావి నారాయణరెడ్డి త్యాగధనుడు: CM రేవంత్

TG: రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో CM రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన నారాయణరెడ్డి ప్రజల కోసం 500 ఎకరాల భూమిని దానం చేసిన త్యాగధనుడని కొనియాడారు. ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శమన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఈ పురస్కారం దక్కడం సముచితమన్నారు. జైపాల్ రెడ్డి ఓటమికి తానే కారణమైనా, ఆయన తనపై ఎప్పుడూ ద్వేషం చూపలేదని గుర్తు చేసుకున్నారు.
Similar News
News February 16, 2026
APPLY NOW: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News February 16, 2026
ఆలయ శిఖరం ఎత్తుగా ఎందుకు ఉంటుంది?

ఆలయ నిర్మాణం భగవంతుని శయన రీతిని పోలి ఉంటుంది. గోపురం స్వామి పాదాలకు, గర్భాలయం శిరస్సుకు ప్రతీకలు. గోపురం ఎత్తుగా ఉంటే దూర ప్రాంతాల వారికి సులువుగా తెలుస్తుంది. గోపుర దర్శనం పాద నమస్కారంతో సమానం. ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఎత్తైన ఆలయాలు రక్షణ కేంద్రాలుగా నిలుస్తాయి. దేవుడు సర్వోన్నతుడనే భావనను పెంచేందుకు, భక్తులలో ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేందుకు ఆగమశాస్త్రం ప్రకారం గోపురాలను ఎత్తులో నిర్మిస్తారు.
News February 16, 2026
బిల్‌గేట్స్.. అమరావతికి ఆహ్వానం(PHOTOS)

AP: మైక్రోసాఫ్ట్ ఫౌండర్, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు నారా లోకేశ్ సహా మంత్రులంతా ఘన స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని వెల్కమ్ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పైన గ్యాలరీలో చూడవచ్చు.


